calender_icon.png 5 December, 2024 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక ఉత్పత్తి లక్ష్యంగా సాగు చేయండి

08-11-2024 11:34:36 AM

జడ్చర్ల (విజయక్రాంతి): సరైన సమయంలో విత్తనాలు విత్తడం ద్వారా దిగుబడి అధికంగా వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు. జడ్చర్ల మండలంలోని కొడ్గల్ గ్రామంలో ఉచిత మొక్కజొన్న విత్తన పంపిణీ, అధిక ఉత్పత్తి అవగాహన సదస్సు నిర్వహించారు. కోడ్గల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులకు 120 ఎకరాలలో పండించటానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఉచితంగా మొక్కజొన్న విత్తనాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ.. శాస్త్రీయమైన సలహాలు తీసుకుంటూ అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.

మూస దారిలో పంటలు సాగు చేయకూడదని అవసరమైన సలహాలు సూచనలను వ్యవసాయ అధికారుల ద్వారా తీసుకొని సాగు చేయడం ద్వారా పంట దిగుబడి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు మంచి సలహాలు సూచనలు అందించేందుకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. భూమి సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటూ ఆ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందో వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేసిన అనంతరము దిగుబడి సరిగా రాలేదని రైతులు దిగులు చెందకూడదని ముందుగానే ఈ విషయంపై జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి రైతు సొంతం అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాస్త్ర వేత్తలు రైతులకు మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి కోసం శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఐసిఎఆర్ లూథియానా నుండి ప్రధాన శాస్త్రవేత్త ఝాట్, హైదరాబాద్ పరిశోధన స్థానం నుండి ప్రధాన శాస్త్రవేత్తలు సునీల్, నగేష్, కీటక శాస్త్రవేత్త సౌజన్య, పాథాలజి శాస్త్రవేత్త మల్లయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో  జడ్చర్ల డివిజన్ ఆంజనేయులు, జడ్చర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీ గోపీనాథ్, ఎఇఓ లు ఎలియ, శేఖర్, భవాని, నవనీత, కోడ్గల్ గ్రామ రైతులు శ్రీనివాస్ రెడ్డి, రఘుమ రెడ్డి, నర్సింలు, సాయి రెడ్డి, నవీన్ రెడ్డి గారు, తౌర్య లింగంపేట్ రైతులు పాల్గొన్నారు.