calender_icon.png 5 December, 2024 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులతో కలిసి జన్మదిన వేడుకలు

08-11-2024 11:24:33 AM

కొత్తపల్లి (విజయక్రాంతి): నగరంలోని ఒకటవ డివిజన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రైతులతో కలిసి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఐకెపి నిర్వాహకులను కోరారు.