08-07-2025 12:48:47 AM
ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించిన అక్కాపూర్ రైతులు
కామారెడ్డి, జూలై 7 (విజయ క్రాంతి), తాము సాగు చేసుకుంటున్న భూములకు పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని రైతులు కలెక్టరేట్ కు సోమవారం తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా అక్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్న తమకు తాము సాగు చేసుకుంటున్నా భూములకు పొడుపట్టాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
అక్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులు నాగరత్ కిష్టవ్వ, గడ్డం మధు, సంగు బాలయ్యలు మాట్లాడుతూ గత 60, 70 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనము కొనసాగిస్తున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా అటవీశాఖ అధికారులు పోలీసు బలగాలతో అక్కాపూర్ గ్రామానికి వచ్చి తాము సాగు చేసుకుంటున్నా భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటామని,
తమపై కేసులు పెట్టి అటవీ శాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా బోరు, మోటార్ వేసుకుని పంటలు పండించుకొని జీవనం కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. 50 ఎకరాల భూములకు ఓడు పట్టాలు ఇవ్వాలని పంట పండించుకొని బతుకుతున్నామని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు.
ఈ 50 ఎకరాల్లో 100 కుటుంబాలు బతుకుతున్నాయని తెలిపారు. 100 కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కాపూర్ దళిత రైతులు రమేష్, రాజేందర్, శ్రీనివాస్, రాజవ్వ, సంతోష్, లక్ష్మి, ఎల్లయ్య, దేవయ్య, రేణుక, రాజబాబు, సంతోష్, నితిన్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.