calender_icon.png 8 July, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

08-07-2025 12:47:14 AM

అక్కడికక్కడే మృతి చెందిన భర్త అపస్మారక స్థితిలో భార్య 

నిజామాబాద్, జులై 7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బాగేపల్లి కి చెందిన భార్య భర్త ద్విచక్ర వాహనంపై నిజాంబాద్ కు వస్తుండగా వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. వెనుక నుండి కారు వేగంగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వడ్ల రాములు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్ర గాయాలైన అతడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బాగేపల్లి గ్రామానికి చెందిన వడ్ల రాములు ఆయన భార్య ఇందిరా పని నిమిత్తం సోమవారం ఉదయం మోటార్ సైకిల్ పై నిజామాబాద్ కు బయలుదేరారు జూపల్లి గేటు వద్దకు రాగానే బోధన్ నుండి నిజామాబాద్ వస్తున్న కారు మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు కింద పడిపోయారు భర్త రాముల కు తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న రాములు భార్య ఇంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎడపల్లి ఎస్త్స్ర సంఘటన స్థలాన్ని పరిశీలించి కార్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాగేపల్లి కి చెందిన భార్యాభర్తలు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి మృతి చెందిన రాములు ఇంద్రకు ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.