09-12-2025 01:10:15 AM
తరుణ్ భాస్కర్ మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాను న్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్. ఈ సినిమాతో ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీ న్ సనివరపు ఈ చిత్రానికి నిర్మాతలు. సోమవారం ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది.
అయితే, రవీంద్రభారతి వద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు వివాదం చెలరేగిన నేపథ్యంలో తరుణ్ భాస్కర్ స్పందించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్న కు బదిలిస్తూ.. “పాలనాపరంగా మనం వేరుగా ఉండొచ్చు.. సంస్కృతీసంప్రదాయాల పరంగా మాత్రం అంతా ఒక్కటే. అందరి భావోద్వేగాలూ ఒక్కటే. ఊహాజనిత అడ్డుగోడలు మనల్ని వేరుచేయలేవు. ఆంధ్రా, తెలం గాణ అని కాకుండా మనదేశంలో గొప్ప నటీనటులు, టెక్నీషియన్లున్నారు.
నేను రెండు రాష్ట్రాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. రాజమండ్రి నాది.. వరంగల్ నాది.. సినిమాతో అందరికీ ప్రేమను పంచుదాం” అని సమాధానమిచ్చారు. ఈషా రెబ్బా మాట్లాడుతూ.. “సృజన్ మంచి సినిమాలు చేసే నిర్మాత. లొలిసారి ఆయనతో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తరుణ్ భాస్కర్‌తో నటిం చడం సంతోషం.. ఆయన డైరెక్షన్‌లోనూ నటించే ఛాన్స్ వస్తుందనుకుంటున్నా” అన్నారు.
‘కొత్త దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన సృజన్ నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నా’ని సజీవ్ తెలిపారు. నిర్మాత సృజన్ మాట్లా డుతూ.. “ఇది రీమేక్ అని అందరికీ తెలుసు. ప్రేక్షకులకు అసలు ఆ విషయం గుర్తు రాకుండా ఏం చేయాలో అది చేశాం. చాలా సర్‌ప్రైజ్ అవుతారు” అని చెప్పా రు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మా జీ, డైలాగ్ రైటర్ నందకిషోర్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.