09-12-2025 01:08:06 AM
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీ మనోహర్ తెరకె క్కిస్తున్న ఈ చిత్రానికి వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం నుంచి ‘పైసా డుమ్ డుమ్’ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేశ్ అగస్త్య మాట్లా డుతూ.. “ఈ కథలో నేనే హీరో అని అను కోవడం లేదు. అన్ని పాత్రలకూ ఇంపార్టెన్స్ ఉంటుంది.
నా కెరీర్‌లో ఇదొక కొత్త తరహా క్యారెక్టర్‌లా పేరు తీసుకొస్తుంది” అన్నారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “కంటెంట్ బాగుంటే తక్కువ టైమ్‌లోనే ప్రేక్షకులకు రీచ్ చేయొచ్చు. మా సినిమా అలాంటిదే” అని తెలిపింది. “తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగిన వార్ ఈ మూవీ కాన్సెప్ట్” అని డైరెక్టర్ చెప్పారు. ‘గుర్రం పాపిరెడ్డి’ని అవతార్ సినిమాతోపాటే రిలీజ్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ తెలిపారు. నటులు జీవన్‌కుమార్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి తదితర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.