calender_icon.png 11 December, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..?

09-12-2025 01:11:45 AM

ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఈషా’. ఇందులో త్రిగుణ్ కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. హెబ్బాపటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరి స్తున్న ఈ సినిమా వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ల ద్వారా డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేక ర్స్. ట్రైలర్ చూస్తే.. ఇది రెగ్యులర్ హారర్ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా  కనిపిస్తుంది.

మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉందంటూ ట్రైలర్‌ను మొదలు పెట్టిన తీరు చూస్తే.. ప్రేక్షకలు ఉలిక్కిపడే ట్విస్టులు బాగానే ఉన్నాయనిపిస్తోంది. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చు ట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే..’ అనే ఛాలెంజ్.. సైన్స్‌కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.