31-07-2025 12:00:00 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ
రాజన్న సిరిసిల్ల: జూలై 30 (విజయక్రాంతి)సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, సమీకృత మినీ సమావేశ మందిరంలో సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 16 పి.హెచ్.సి సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లాలో మంజూరైన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలలో మూడు పి.హెచ్.సి లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని,మరో పి.హెచ్.సి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, గంభీర్ రావు పేట రూఫ్ దశలో ఉందని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాకు మంజూరైన 16 సబ్ సెంటర్ల మంజూరు కాగా ఐదు సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండల తహసిల్దార్ లతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి భూ సమస్యలనుపరి ష్కరించారు.పి.సెచ్.సి సబ్ సెంటర్ నిర్మాణ పనులు అదేవిధంగా గంభీరావుపేట్ పిహెచ్సి ని ర్మాణ పనులు వేగవంతంగా పూర్తి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పి.హెచ్.సి, సబ్ సెంటర్ల నిర్మా ణానికి ప్రభుత్వం నిధులు అందుబాటులో పెట్టిందని, పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక చోరువతో పని చేయాలని అన్నారు. అగ్రహారం, తిప్పపూర్ బస్టాండ్ ప్రాంతంలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు.ఈ సమావేశంలో ఈ ఈ పి ఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.