17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాజీవ్ యువ వికాసంతో డెయిరీ, కూరగాయల సాగు ఉత్తమం

15-04-2025 12:00 AM

ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి) : రాజీవ్ యువ వికాసం పథకంతో కుటీర పరిశ్రమలు, పాల ఉత్పత్తి కేంద్రాలు(డైరీ), కూరగాయల సాగు, ఫ్లోరికల్చర్ చేసి వ్యాపారం చేయడం ఉత్తమమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రైతుల మహోత్సవం రైతు మేళా ముగింపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కూరగాయలు, పువ్వుల కొరత తీవ్రంగా ఉందని, వాటి సరఫరాపై యువత దృష్టి సారిస్తే ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నారు.

ప్రతీ రోజు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, పువ్వులు దిగుమతి అవుతున్నాయన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం అందించే సబ్సీడీతో ఈ వ్యాపారం నిర్వహించి లాభాలు పొందచ్చని సూచించారు. మొక్కజొన్న, గోధుమలతో వాల్యూ యాడెడ్ ఉత్పత్తి వ్యాపారం, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, చిరుదాన్యాల సాగు మంచిదన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి, అగ్రికల్చర్ హార్టికల్చర్ సొసైటీ కార్యదర్శి జీ.వీ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.