13-08-2025 12:00:00 AM
అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఆదేశం
మానకొండూర్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల పరిధిలోని జూగుండ్ల-గోపాలపూర్ గ్రా మాల్లో నెలకొన్న భూసమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించా లని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆ గ్రామాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మహేశ్వర్, జిల్లా సర్వే,భూరికార్డులశాఖ సహాయ సంచాలకునితో కలిసి సందర్శించి సమస్యత్మాకమైన 8 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గోపాలపూర్ గ్రామంలో ఒక రైతుకు, దళితులకు మధ్య భూవివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నదని, 178 సర్వే నెంబర్ లో దళితులకు చెందిన 8 ఎకరాల భూమి రికార్డుల్లో తప్ప మోఖాపై లేదని, ఆ భూములు ఆక్రమణలకు గురైనదని దళితులు ఆందోళన చెందుతున్నారన్నారు. దళితుల భూమి విషయంలో ఇరు గ్రామాల్లో రగులుతున్న భూ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే జిల్లా అధికార యంత్రాంగాన్ని ఇక్కడకు తీసుకు వచ్చినట్టు ఎమ్మెల్యే వివరించారు.
ఆ 8 ఎకరాల కొలతలు,హద్దులు తేల్చాలని, ఇందుకోసం సత్వరమే భూ సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, గన్నేరువరం తహసీల్దార్ జె.నరేందర్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లా క్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మోరప ల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు మామిడి అనిల్ కుమార్, బుధారపు శ్రీనివాస్, రెడ్డిగాని రాజు, ఉప్పులేటి రాజు, ఉప్పులేటి సతీష్, బాలయ్య, హసన్, తదితరులుపాల్గొన్నారు.