12 April, 2026 | 7:02 AM

దళితబంధు రెండో విడత నిధులివ్వాలి

28-06-2024 05:38 AM
  • ఎమ్మెల్యే పాడి దిష్టిబొమ్మ దహనం

హుజూరాబాద్, జూన్ 27 : దళితబంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితబంధు రెండో విడత సాధన సమితి ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ.. దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే రాలేదని ఆరోపించారు.

దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్‌లీవ్ పెట్టించి దళితబంధును నిలిపివేశాడని అన్నారు. కౌశిక్‌రెడ్డి దళిత ద్రోహి అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం దళితబంధు రెండో విడత నిధులను మంజూరు చేయాలని కోరారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంపులోని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.