పుష్పరాజ్ విధ్వంసం.. రూ.1000 కోట్లతో రికార్డ్
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల మార్కుని దాటేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. భారత సినీ చరిత్రలో ఏ సినిమా కూడా ఇంత ఫాస్ట్‌గా రూ.1000 కోట్ల గ్రాస్‌ని అందుకోలేదు. పుష్ప 2’ ఫాస్ట్‌గా రూ. 1000 కోట్ల మార్క్‌ని చేరుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏ ఏ చిత్రాలు , ఎన్ని రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును అందుకున్నా యో చూద్దాం. ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రం 10 రోజుల్లో .. ‘కేజీఎఫ్ 2’, ‘కల్కి’ చిత్రాలు 16 రోజుల్లో.. జవాన్, పఠాన్ చిత్రాలు రూ.౧౦౦౦ కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు వరుసగా 18, 27 రోజు సమయం తీసుకున్నాయి.






