calender_icon.png 3 September, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛీ..చీ.. 400 మంది విద్యార్థినీలకు 4 బాత్రూములే

02-09-2025 06:11:05 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో400 మంది విద్యార్థినీలకు నాలుగు బాత్రూంలే పనిచేయడంతో విద్యార్థినీలు అనునిత్యం ఆవస్తలు పడుతున్నారు. ఈ సంఘటన పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న తహసిల్దార్ దయానందం మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 603 మంది విద్యార్థినీలు అడ్మిషన్ పొందగా 416 మంది విద్యార్థినీలు హాజరయ్యారు. గురుకులంలో 650 మంది విద్యార్థినీలకు 72 బాత్రూములు నిర్మాణం చేశారు .కానీ వాటిలో నాలుగు మాత్రమే పనిచేయుచున్నాయి.

మిగిలినవన్నీ కూడా పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. తహసిల్దార్ పాఠశాలలో వంట గది, స్టోర్ రూమును  పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తాజా కూరగాయలు వండి పెట్టాలని చూపించారు. అనంతరం గురుకులంలోని బాత్రూంలను పరిశీలించి శానిటరీ వ్యవస్థ బాగాలేదని వాటిని శుభ్రం చేయించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని ప్రిన్సిపాల్ అరుణశ్రీకి సూచించారు. తాత్కాలికంగా బాత్రూంలను సంపును క్లీన్ చేయించి విద్యార్థినీలకు ఉపయోగంగా ఉండేలా చూడాలని అన్నారు.

శానిటరీ వ్యవస్థ బాగా లేక కొంతమంది విద్యార్థులు టీసీలు తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారని తమ దృష్టికి వచ్చిందనిఅన్నారు. పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రార్ధన సమయానికి అందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని లేనిపక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన గిరిజన గురుకుల పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మత్తులు చేయించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ,విద్యార్థి సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.