calender_icon.png 24 December, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీని కలిసిన దాసుతండ సర్పంచ్

24-12-2025 08:54:26 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని దాసుతండ గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య చందర్ సింగ్ రాథోడ్ బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలను విన్నవించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ అతి త్వరలోనే అన్ని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తారని తెలిపినట్లు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూక్య ఈశ్వర్ నాయక్, మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు రూపావత్ శ్రీనివాస్, టేకులపల్లి మండల నాయకులు లకావత్ లాలు తదితరులు ఉన్నారు.