calender_icon.png 24 December, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

24-12-2025 08:56:53 PM

మంచి విద్య భోజనం అందించండి

ఎలమంచి తండా సర్పంచ్ బద్రునాయక్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచి తండా గ్రామపంచాయతీ అంగన్వాడి సెంటర్లో పిల్లలందరికీ మంచి విద్యా భోజనం అందించాలని ఎలమంచి తండా సర్పంచ్ బానోతు బద్రు నాయక్ అన్నారు. బుధవారం అంగన్వాడి సెంటర్లో పిల్లలకు విద్యాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలని కచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కి పంపించాలని వారి మెదడుపై ఒత్తిడి పడకుండా సులువుగా అక్షరాలు నేర్చుకోవడం అంకెలు నేర్చుకోవడం, బొమ్మలతో అక్షరాలను గుర్తుపట్టడం పదాలను పలకడం సులువుగా నేర్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ భద్రమ్మ, హెల్పర్ నాగమణి, పిల్లలు,తల్లులు, తదితరులు పాల్గొన్నారు.