calender_icon.png 24 December, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్స్ఫర్డ్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

24-12-2025 08:50:39 PM

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను  విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం  ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు.

క్రీస్తు జననం, మానవాళికి ఆయన అందించిన సందేశంతో పాటుగా, శాంతి, ప్రేమ, ఆదరణలపై యేసు ప్రభువు ప్రపంచానికి చాటిచెప్పిన అంశాలను విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా వివరించారు. శాంటా క్లాస్ వేషధారణలో విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో హడావుడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.