03-05-2025 07:52:23 PM
నారాయణఖేడ్: భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ మండల అధ్యక్షుడుగా రెండవ సారి రుద్రారం గ్రామానికి చెందిన సిందోల్ దశరథ్ కురుమని నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా దశరథ్ కురుమ మాట్లాడుతూ... రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ పార్టీ గెలుస్తుందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర జిల్లా నాయకత్వానికి, మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ, సీనియర్ నాయకులు బస్వారాజ్ పాటిల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుణ్ రాజు, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, కో కన్వీనర్ నగేష్ యాదవ్ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ కి కృతజ్ఞతలు తెలిపారు.