03-05-2025 07:49:31 PM
రాజాపూర్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం శనివారం దాతలు శ్రీ మామిళ్ల బాచ్చిరెడ్డి రూ.1లక్ష, భూతిపూర్ రాంరెడ్డి రూ.1 లక్ష ఒకవేయి 116, పెరుమల్ల నర్సింలు రూ.21వేలు, హనుమాన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రూ.17 వేల విరాళాలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం కోసం విరాళాలు రాసిన దాతలు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, రాంరెడ్డి, రామకృష్ణా గౌడ్, శ్రీనాధ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాలయ్య, పీ.నర్సింలు ,సి.నర్సింలు, ఎం. చంద్రయ్య, పీ. చంద్రయ్య, కృష్ణయ్య, హోటల్ శేఖర్, ఎం భీమయ్య, సీ. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.