calender_icon.png 16 November, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాపుల్లో డీసీఏ దాడులు

29-07-2024 01:31:55 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి) : డీసీఏ అధికారులు పలు మెడికల్ షాపుల్ల్లో నిర్వహించిన దాడుల్లో అనుమతి లేని మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో త్రిఫల, గగ్గులు అనే మాత్రలు ఊబకాయానికి ఔషధంగా పనిచేస్తాయంటూ తప్పుడు ప్రచారం చేసి పలు మెడికల్ షాపుల నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధు ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మందులను తయారు చేసినట్లు గుర్తించారు.