16-11-2025 07:00:07 PM
మేడిపల్లి (విజయక్రాంతి): వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీకి చెందిన దండు రాములమ్మ(45) దూరపు బంధువు అయిన కోలార్ రాజ్ కుమార్ తండ్రి బండెప్ప(50) సంవత్సరాలు వృత్తి డ్రైవర్, అతను సుమారు 15 సంవత్సరాల నుండి డ్రైవర్ గా పని చేస్తూ రాములమ్మ ఇంట్లో ఉంటున్నాడు. 13వ తేదీ రాత్రి పది గంటల యాభై నిమిషాలకు డ్యూటీ నుండి వచ్చి అన్నం తిని ఇంట్లోనే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటల నుండి ఇంట్లో కనిపించుట లేదు అని, రాములమ్మ మేడిపల్లి పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.