calender_icon.png 16 November, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజు కులస్తులంతా ఐక్యతతో హక్కులను సాధించుకోవాలి

16-11-2025 07:09:47 PM

బాషబోయిన భాస్కర్..

కోదాడ: ముదిరాజు కులస్తులంతా ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు బాషబోయిన భాస్కర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని రామిరెడ్డి పాలెం వద్ద మామిడి తోటలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహాయ సహకారాలతో ముదిరాజుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ముసి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తమ్మనబోయిన వీరబాబు ,చారుగుండ్ల సత్తయ్య, ముసి మట్టయ్య ,అల్లి వీరబాబు, కైలాస వెంకటేశ్వర్లు ,చిలక రమేష్ గుండ్లపల్లి వెంకయ్య టి రామయ్య, కె నాగార్జున్ ,కాకి సీతారాములు, నాయన మల్లయ్య ముదిరాజు మహిళా సోదరులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.