calender_icon.png 16 November, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ కమిటీల ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన

16-11-2025 06:57:06 PM

వ్యవసాయ క్షేత్రాల్లో భక్తి పారవశ్యం..

గజ్వేల్: గజ్వేల్ ప్రాంతంలోని ఆలయ కమిటీల ఆధ్వర్యంలో కార్తీక కృష్ణపక్ష ద్వాదశి పురస్కరించుకొని వ్యవసాయ క్షేత్రాల్లో ఘనంగా కార్తీక్ సమారాధన నిర్వహించారు. గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అన్నపూర్ణ విశ్లేశ్వర స్వామి, సంతోషిమాత తదితర ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం వ్యవసాయ క్షేత్రాల వద్ద తులసి దాత్రినారాయణ కళ్యాణం, సాలగ్రామ పూజ, వనభోజన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆర్థిక సమారాధనలో ధూప దీప నైవేద్యం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ సేవా వాహిని సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శేషం శ్రీనివాసా చార్యులు మాట్లాడుతూ కార్తీకమాసంలో గోపూజ, ధాత్రి నారాయణ కళ్యాణం, కార్తీక వనభోజనాలు నిర్వహించడం ఎంతో శ్రేష్టమన్నారు. మాది ఆత్మ కమిటీ చైర్మన్ గూడెం కృష్ణారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోను దేశపతి రాజశేఖర్ శర్మ వైదిక నిర్మాణంలో ఘనంగా కార్తిక సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్,ఆలయ బాధ్యులు టి ఎం డి లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, మరియు ఆర్యవైశ్య నాయకులు నంగునూరి సత్యనారాయణ, రుక్మయ్య అయిత సత్యనారాయణ, మడిపెడిగే గాలయ్య, నేతి కృష్ణమూర్తి,మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.