16-11-2025 07:03:12 PM
కుంటాల (విజయక్రాంతి): అన్ని ఉద్యోగాలు కంటే ఉపాధ్యాయ ఉద్యోగం ఎంతో పవిత్రమైందని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు తోట నరేంద్రబాబు అన్నారు. ఆదివారం రోజు కుంటాల మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో లింబ బి సకరపు గజేందర్ పదవి విరమణ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవి విరమణ సహజమేనని పేర్కొన్నారు ఉద్యోగ రీతిలో ఆయన చేసిన సేవలను పలువురు వ్యక్తులు గుర్తు చేశారు. ఉద్యోగంలో చేసిన సేవలను తప్పనిసరిగా గుర్తు చేస్తారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవి విరమణ సాధారణమైన అని తెలియజేశారు. విద్యారంగానికి ఆయన ఎంతో కృషి చేశారని విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలలో పెంచేందుకు ఎంతో కృషిచేసిన ఆయన సేవలు మరువలేమని గుర్తు చేశారు. అనంతరం దంపతులను ఘనంగా ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్ మాజీ ఎంపీపీ ఆప్కా గజ్జరం యాదవ్ పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రమణారావు మండల అధ్యక్షులు అంబకంటి సతీష్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి కొండ ప్రవీణ్ కుమార్ తో పాటు ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వివిధ పార్టీ ల నాయకు ఉన్నారు.