26-01-2026 11:02:18 AM
జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం దేశ ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆశయాలను కాపాడుకుంటూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం అనే విలువలే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకాలని అన్నారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాలు పేదలు, మహిళలు, రైతులు, కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ అమలు చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.