calender_icon.png 26 January, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

26-01-2026 11:06:15 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లోని బీఆర్ఎస్ ఆసిఫాబాద్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

తదనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.