calender_icon.png 26 January, 2026 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ విలువలకు కట్టుబడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలి

26-01-2026 11:00:34 AM

జిల్లా ఎస్పీ నితికా పంత్

జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ 

పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన  ఎస్పీ

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ  నితికా పంత్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగా మనకు రాజ్యాంగం లభించిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దేశానికి అమూల్యమైన మార్గదర్శకమని, ఈ రోజున ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు.

ఎలాంటి భేదాభిప్రాయాలు లేని సమానత్వ సమాజం కోసం రాజ్యాంగం రచించబడిందని తెలిపారు.పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరిగే విధంగా పని చేసినప్పుడే రాజ్యాంగానికి సార్థకత ఉంటుందని అన్నారు. విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు.అనంతరం పోలీస్ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 44 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, ఇన్‌స్పెక్టర్లు సతీష్, బాలాజీ వరప్రసాద్, రమేష్, సంజయ్, కుమారస్వామి, సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సీసీ కిరణ్‌,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.