నీట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి...
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
మంచిర్యాల, జూన్ 21 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర నీట్ పరీక్షా కేంద్రాలను, భద్రతా ఏర్పాట్లను ఆది వారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పరిశీలించి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మంచిర్యాలలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో 1,204 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా పరీక్షలకు హాజరయ్యే లా ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతిస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిం చి, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా నిషేధిత వ స్తువులు లోపలికి తీసుకెళ్లకుండా ప్రత్యేక చ ర్యలు చేపట్టామన్నారు.
పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే కేంద్రాల్లోకి అనుమతించామని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీఆర్పీఎఫ్, స్థానిక ఆరమ్డ్ రిజర్వ్ పోలీ సు బలగాలు, సివిల్ పోలీసులతో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బస్సులతో పాటు ఆటోల ఏర్పాటు
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ప్రభుత్వ బస్సు సౌ కర్యాలతో పాటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక రవాణా (ఆటోలను) ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. అవసరమైన చోట్ల పోలీసు వాహనాలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించామని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం పరీక్షా సామగ్రిని సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల భద్రత మధ్య సంబంధిత అధికారులకు తరలిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.






