22 June, 2026 | 2:42 AM

గాడి తప్పిన సర్కార్ వైద్యం

22-06-2026 12:00 AM

కలెక్టర్ సాక్షిగా బయటపడ్డ లోపాలు 

గడువు తీరిన మందులతో రోగులకు వైద్యం 

ప్రభుత్వ వైద్యం కన్నా ప్రైవేటు వైద్యం మక్కువ 

నిర్మల్ జూన్ 21 (విజయక్రాంతి): నేను రాను బిడ్డ సర్కారు సర్కారు దవఖానకు అనే పాట గుర్తొస్తుంది. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్మల్ జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆసుపత్రుల నిర్వహణ గాడి తప్పుతోంది. ఆస్పత్రిలో ఆరోగ్య చికిత్సల కోసం వెళ్లిన రోగుల సంగతి దేవుడెరుగు గానీ వైద్యాన్ని అందించి రోగి ప్రాణాలను కాపాడవలసిన వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.

జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా శనివారం నిర్మల్ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేయక అనేక లోపాలు గుర్తించి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తిగా వెళ్లిన కలెక్టర్ క్యూఆర్ కోడ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని కంటి పరీక్షల కోసం వైద్యుని సంప్రదించగా కంటి వైద్యుడు కాలం చెల్లిన ఐ డ్రాప్ కలెక్టర్ కళ్ళలో వేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ భవిష్ మిశ్రా ఐ డ్రాప్ ను చేతిలో తీసుకొని పరిశీలించగా రెండు నెలల క్రితమే ఎక్స్పైర్ డేట్ ఉన్న ఐ డ్రాప్ చూసి కలెక్టర్ షాక్ అయ్యారు.

అప్పటివరకు ఆసుపత్రి సిబ్బంది గప్చుప్ గా ఉండగా కలెక్టర్ సాక్షిగా ఈ డొల్లతనం బయటపడడంతో ఆసుపత్రి సూపర్డెంట్ తో పాటు నిధులు నిర్వహించి సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే చేరుకున్న కలెక్టర్ శాఖ పరమైన చర్యలు చేపడుతున్నట్టు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కి గడువు తీరిన ఐ డ్రాప్ ఆస్పత్రి సిబ్బంది ఇవ్వడంపై ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం గాడి తప్పిందనడానికి నిదర్శనంగా ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో వివిధ విభాగాలకు చెందిన వైద్యులు వైద్య సిబ్బంది నర్సులు ఫార్మసిస్టులు పారామెడికల్ సిబ్బంది ఉన్నప్పటికీ రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలు వినస్తున్నాయి. ఇది నిర్మల్ లోనే కాదు బైంసా ఖానాపూర్ ముధోల్ నరసాపూర్ ప్రభుత్వ విధాన పరిషత్ ఆసుపత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు ఇటీవలే ఆకస్మిక తనిఖీలు లోపాలు బయటపడ్డాయి. 

గత ఏడాది ఖానాపూర్ లో ఘటన

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ఏరియా ఆసుపత్రిలో గత ఏడాది ఇదే తరహా లోపం బయటపడింది. కడెం మండలం చెందిన ఓ పేషంట్ ఖానాపూర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. అక్కడ సిబ్బంది తీవ్ర జ్వరం ఉన్నట్టు గుర్తించి ఆయన కు ఫ్లూ యూడ్ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించారు. ఆ బాటిల్ సరిగ్గా పెట్టకపోవడంతో రోగి బంధువులు బాటలు పరిశీలించగా బాటిల్ గడువు రెండు నెలల క్రితమే తేదీ ముగిసింది.

రోగి బంధువులు ఆందోళన గురై జిల్లా వైద్యులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు బైంసా ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నట్టు రోగులు చెప్తున్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ బైంసా ఏరియా ఆస్పత్రిలో ప్రతిరోజు వందల సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు. వారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శాస్త్ర చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించాలి.

ఏం చేస్తున్నావైద్యులు మధ్యాహ్నం వరకు రోగులను పరీక్షించి మధ్యను ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామందికి రోగాలు నయం కాకపోవడంతో మళ్లీ ప్రైవేటు ఆసుపత్రిలో చేరుతున్నారు. దీనివల్ల పేద ప్రజలకు ఆరోగ్య భారం పడుతుంది. నిర్మల భైంసా ఖానాపూర్ ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యులు ఉన్నప్పటికీ రోగి పరీక్షలకు సంబంధించిన పరికరాలు యంత్రాలు లేకపోవడంతో ప్రైవేట్ లో డబ్బులు చెల్లించి పరీక్షలు నిర్వహించుకుంటున్నారు.

సిటి స్కానింగ్ అల్ట్రా స్కానింగ్ వంటి పరికరాలు పనిచేయడం లేదు. ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ కూడా స్వస్థతగా ఉండటంతో కలెక్టర్ మండిపడుతున్నారు గత 15 రోజులు జిల్లా కలెక్టర్ నిర్మల్ బైంసా ఖానాపూర్ ఆసుపత్రులను వరుసగా తనిఖీలు నిర్వహించి ప్రతి విభాగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేది పేద మధ్యతరగతి ప్రజలే కావడంతో వారికి ప్రభుత్వ వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులదేనని నొక్కి చెప్తున్నారు. మందులు ఇతర మౌలిక సదుపాయాల కొరతపై కూడా శూన్యంగా ఆరా తీస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు వైద్య విధానంలో లోపాలు బయటపడడంతో ప్రభుత్వ వైద్యం గాడి తప్పిందని దీన్ని సరి చేసేందుకు జిల్లా కలెక్టర్ చొరవ చూపడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ హడల్ 

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో జిల్లా ప్రజలకు సంతోషం వ్యక్తం వ్యక్తం చేస్తుండగా పనిచేస్తున్న సిబ్బంది మాత్రం భయాందోళనకు గురవుతున్నారు.  ఎప్పుడు ఏ ఆస్పత్రికి వచ్చి ఏ వివరాలు అడుగుతారు అని హైరానా పడుతున్నారు.

గతంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆమ్మద్ బాబు.ఇదే తరహాలో ఇదే తరహాలో తనిఖీలు చేయడంతో జిల్లాలో ప్రతి ఒక్క శాఖ అధికారి సమయపాలన పాటిస్తూ ప్రతిరోజు విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ అందించేవారు. అప్పటి జ్ఞాపకాలను ప్రస్తుతం మరోసారి ఈ జిల్లా కలెక్టర్ చేపడుతున్న చర్యలు గుర్తుచేస్తున్నాయని పలువురు ప్రజలు బహిరంగంగా నే చర్చించుకుంటున్నారు. పేద ప్రజలకు సర్కార్ వైద్యం అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆ దిశగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని జిల్లా పరిధిలో కోరుతున్నారు.