calender_icon.png 30 January, 2026 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మున్సిపల్ నామినేషన్ల గడువు

30-01-2026 08:54:47 PM

కోదాడలో పోటెత్తిన అభ్యర్థులు

కోదాడ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కోదాడ మున్సిపల్ కార్యాలయం అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వివిధ పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీలుగా తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు.

గడువు ముగిసే సమయానికి నామపత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు పోటీ పడటంతో కార్యాలయ ఆవరణలో కోలాహలం నెలకొన్నది. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేయగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.