calender_icon.png 30 January, 2026 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడకండ్ల కెనాల్ వద్ద నీటి విడుదల పట్ల హర్షం

30-01-2026 08:52:09 PM

- మంత్రి ఉత్తమ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

గజ్వేల్: పంట పొలాలు ఎండిపోకుండా నీటిని విడుదల చేయడం పట్ల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి, గజ్వేల్ ఏఎంసి  చైర్మన్ నరేందర్ రెడ్డి, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గురువారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఈఎన్సి శివ చరణ్ తేజ, సంబంధిత అధికారుల దృష్టికితేగా,  శుక్రవారం కొడకండ్ల కెనాల్ వద్ద నీటి విడుదలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చి వెంటనే విడుదల చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఈ సందర్భంగా నర్సారెడ్డి స్పష్టం చేశారు. అయితే రబీ సాగు పూర్తయ్యే వరకు నీటిని వృధా చేయకుండా పంట పొలాలకు మాత్రమే వినియోగించుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.