07-05-2025 09:03:39 PM
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్..
హనుమకొండ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ హసన్ పర్తి మండల శాఖ తరఫున, మండల అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి హసన్ పర్తి తహశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66 డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ... హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ, ప్రస్తుతం దేశ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
హసన్ పర్తి మండల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల రోహింగ్యా ముస్లింలు, ఇతర అరబ్ దేశాల నుండి అక్రమంగా చొరబడిన విదేశీయులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీరి సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మారపల్లి రామచంద్రారెడ్డి, వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, రైల్వే బోర్డు మెంబర్ మేకల హరిశంకర్, హసన్ పర్తి మండల అధ్యక్షుడు మారం తిరుపతి, మాజీ ఎర్రగట్టు దేవస్థానం చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు గుర్రాల చంద్రమౌళి, మండల ఉపాధ్యక్షులు బలగని రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిలు కోయేడ రాజు, శంకర్, మహిళా మోర్చా నాయకులు ఉమాదేవి, సీనియర్ నాయకులు గంట సత్యం, మట్టెడ సుమన్, రాజేందర్, రమేష్, తిప్పన్న, శ్రీనివాస్, రవి మండల పదాధికారులు తదితర నాయకులు పాల్గొన్నారు.