calender_icon.png 24 October, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పులే దిక్కు

24-10-2025 01:22:29 AM

-తెలంగాణలో 37.2శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం మందికి.. 

-2020--- లెక్కలు వెల్లడించిన కేంద్ర గణాంక శాఖ 

-మొదటి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ 

-ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో కర్ణాటక మొదటిస్థానం 

-రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్

-దక్షిణాది రాష్ట్రాల్లో 31.8 శాతం, ఈశాన్య రాష్ట్రాల్లో 7.4 శాతం మందికి అప్పులు 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): 2020--- సంవత్సరానికి సంబం ధించి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన లెక్క ల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ నివేదిక ఆధారంగా తొలి రెండు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిలవడం గమనార్హం. ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో 37.2శాతం మంది ప్రజ లు అప్పులపైనే ఆధారపడినట్లు తెలుస్తున్నది.

ఏపీలో 43.7శాతం మంది అప్పుల్లో ఉన్నారని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇక కర్ణాటకలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానంకాగా ఫైనాన్షియల్ ఇంక్లూ జన్ 95.9శాతం మందితో మొదటిస్థానంలో నిలవగా.. 92.3శాతం మందితో ఏపీ రెండో స్థానాన్ని దక్కిచ్చుకున్నది. అయినా కూడా కర్ణాటక రాష్ట్రంలో కేవలం 23.2శాతం మంది మాత్రమే అప్పుల్లో ఉండగా.. తెలంగాణలో 86.5శాతం మంది ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(ఆర్థిక చేరిక) పరిధిలో ఉన్నారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది.

దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1శాతం మంది ప్రజలు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పరిధిలోకి రాగా, 31.8శాతం మంది అప్పుల్లో ఉన్నారని కేంద్రం విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో 80.2 శాతం మంది ప్రజలు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పరిధిలోకి రాగా, 7.4శాతం మంది ప్రజ లు మాత్రమే అప్పుల్లో ఉన్నారని నివేదికలో వెల్లడైంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ శాతంలో హిందువులు 88.1శాతం ఉండగా.. ముస్లింలు 80.8 శాతం ఉన్నారు.