calender_icon.png 24 October, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ సంబంధమే హత్యకు కారణం

24-10-2025 08:22:10 AM

హత్య కేసులో నింధితుల అరెస్ట్ 

కన్న కొడుకులు నిందితులుగా తేల్చిన పోలీసులు

సూర్యాపేటలో కేస్ వివరాలు వెల్లడించిన డిఎస్పి ప్రసన్న కుమార్

సూర్యాపేట,(విజయక్రాంతి): మనిషి జీవితంలో అక్రమ సంబంధాలు ఎప్పడూ అపాయకరమే అనే విషయాన్ని ఖరారు చేసే రీతిలో ఈ సంఘటన ఆత్మకూరు (ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి బిక్షమమ్మ (40) హత్యకు అక్రమ సంబంధమే కారణమని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం కేస్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆమె గత మూడు సంవత్సరాలుగా వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమం సంబంధం కలిగి ఉండటంతో భర్త కొరివి మల్లయ్య, కుటుంబ సభ్యులు ఆమెను ప్రవర్తన మార్చుకోమని పలుమార్లు హెచ్చరించినట్టు తెలిపారు.

ఎంత చెప్పిన మాటలు లెక్కచేయకుండా అదే విధంగా తన యొక్క అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో చిన్న కొడుకుకు పెళ్లి సంబంధాలు రావడం లేదని, ఊరిలో పరువు పోతుందని భావించి అందుకు అతని భార్య బిక్షమమ్మ ను చంపేస్తే తప్ప మరొక మార్గం లేదని భావించి తన యొక్క ఇద్దరు కొడుకులు కొరివి ప్రవీణ్, కొరివి భరత్ తో చర్చించి తన అన్న కొడుకు కొరివి మహేష్ అతని ఫ్రెండ్స్ వంశి, జనార్దన్ లు అందరు కలిసి ఒక పథకం వేసుకున్నారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ ఉదయం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీకి సదరు కొరివి బిక్షమమ్మ వచ్చి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో ముందుగా అనుకున్న ప్రకారం జనార్ధన్ బైక్ మీద వచ్చి గ్రామంలోని శ్రీరాములు అనే వ్యక్తి ఇంటి ముందు ఆమెను అడ్డగించి వెంటనే మహేష్ కు ఫోన్ ద్వారా తెలుపాడన్నారు.

మహేష్ వంశీయులు కారులో రాగా మహేష్ తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి మీద పొడవుగా వంశీ కూడా తన వద్ద ఉన్న కత్తితో ఆమెను చాతి మీద వీపున పొడిచి అక్కడి నుండి ముగ్గురు పారిపోయారు.ఈ హత్య కేసు గాలింపు భాగంగా గురువారం సూర్యాపేట పట్టణంలో హైటెక్ బస్టాండ్ ముందు కారు అడ్డ వద్ద ఐదుగురు నిందితులను పట్టుకున్నామన్నారు. నిందితుల వద్ద నుండి ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకపోతే తెలిపారు. తదుపరి పట్టుబడి చేసిన నిందితులను రిమాండ్ కు తరలించారు.పరారిలో ఉన్న మరో నిందితుడి కొరివి మహేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ కేసు ను  చేదనలో బాగా పనిచేసిన రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూర్ ఎస్సై  శ్రీకాంత్, చివ్వేంల ఎస్ఐ మహేష్, ఆత్మకూర్, చివ్వేంల సిబ్బందిని అభినందించారు.