24-10-2025 08:18:11 AM
యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈనెల 25న హుజూర్ నగర్ లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళా సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతకే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువతకు ఒక చక్కటి అవకాశం అన్నారు.ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లి,జాబ్ మేళాకు హాజరై,కన్నవారి కలలను సాకారం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.