calender_icon.png 24 October, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు

24-10-2025 08:19:46 AM

బెజ్జుర్,(విజయ క్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.ఈఎస్ఐ కి వెళ్లి వైద్యం చేయమని చెప్తే మీ డబ్బులు చెల్లించలేదు కావున వైద్యం చేయము అని అన్నారని తెలిపారు. మున్సిపల్ కార్మికుల ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఇద్దరి కాల్ తొలగిస్తే తప్ప వాళ్ళు బతికే పరిస్థితి లేదు ఈఎస్ఐ డబ్బులు చెల్లించి ఈఎస్ఐ ద్వారా ట్రీట్మెంట్ చేపించాలని నిరసన తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.