calender_icon.png 24 October, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

24-10-2025 09:03:56 AM

అమరావతి: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం(Bengaluru-bound bus catches fire ) సంభవించింది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది.  పల్సర్ బైక్ ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. వోల్వా బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.

ప్రమాదంలో పలువురు మృతి చెందారన్న వార్త తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి, సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం, ఇతర సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అందించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ఘటన స్థలానికి వెళ్లి, సహాయక చర్యలను పర్యవేక్షించాలని  జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.