24-10-2025 01:15:04 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ఆ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి, వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాల న పట్ల మరింత అవగాహన కల్పించాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు చెప్పారు.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ర్టం గుల్లగుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన ప్రజలు కాంగ్రెస్ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలుపు లక్ష్యంగా కేసీఆర్ అధ్యక్షతన గురువారం ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామ కూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి వివరించాలి
పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పడి దాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాలపై ఇంచార్జీలు ఈ సందర్భంగా కేసీఆర్‌కు నివేదించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ర్టంలో దిగజారిన అభివృద్ధి, రాష్ర్ట ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని కేసీఆర్ సూచించారు.
బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందు కు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని సూచించారు. పేద గర్భిణీలకు మానవీయ కోణంలో అందిస్తున్న కేసీఆర్ కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారో, జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు.
యా దవులకు అందిస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీ నీ ఎందుకు దిగమింగారో, సక్కదనంగ ఇంటిలోపలికి వచ్చే మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావటం లేదో, బస్తీ దవాఖానలకు సుస్తీ ఎందుకు చేసిందో ఓటు అడగ డానికి తమ ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రె స్ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.
హైడ్రా పేరిట కూల్చివేతలపై నిలదీయండి
హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడు తున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలు వ నీడ లేకుంటా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని కేసీఆర్ సూచించారు. రెసిడెన్షి యల్ స్కూళ్లను స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించి వారిని ఐఏఎస్, ఐపీఎస్‌ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దామని, తన ఆలో చనలను అమలుచేసినందుకు ఈ సందర్భం గా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కేసీఆర్ అభినందించారు. అటువంటి అత్యున్నత స్థాయి విద్యను హాస్టల్ సౌకర్యాలను అందించిన గురుకులాల్లో పిల్లలు మరణించడం దారు ణం, శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రాష్ర్ట ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండి ఉన్నదని, నమ్మి గుంతల బడ్డం మోసపోయినమని కోపంలో ఉన్నారని కేసీఆర్ అన్నారు. సక్కదనంగ నడిసే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొ ట్టుకున్నామనే బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉన్నదని, ఎలక్షన్స్ వచ్చినాయనీ కాదు..
కాంగ్రెస్ చేసిన మోసం పట్ల రాష్ర్ట ప్రజలు గుర్రుగా ఉన్నారని, జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలుపును ఇప్పటికే ప్రజలు ఖాయం చేశారని చెప్పా రు. అందుకు డివిజన్లవారీ, క్లస్టర్లవారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలని సూచించారు. ప్రజల చేతుల్లో పైస ఆడక పరే షాన్లో పడ్డారని, ఈ నడుమ తనను కలిసిన పెద్దమనిషిని అడిగితే వ్యాపారాలు నడవక పైసా పెట్టుబడి లేకుంట అయిందని ఆవేదన వ్యక్తంచేశారని కేసీఆర్ గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్‌తోపాటు ప్రతిఒక్క వ్యాపారం బ్రహ్మాండంగా నడిచిందని, అప్పుడు కూలి నాలి అందరి చేతుల్లో పైసలుంటుండెనని, ఇప్పుడు అంతా దివాలా తీసినట్టు అయ్యిందని ఆ పెద్దమనిషి బాధపడ్డారని, ఇప్పుడు మల్ల రాష్ట్రాన్ని బాగుచేయాలంటే ఒక్క బీఆర్‌ఎస్ పార్టీతో తప్ప ఎవరితో సాధ్యం కాదు అని ఆ పెద్దమనిషి స్పష్టం చేసిండు అని చెప్పుకొచ్చారు.
రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ బాగుండటం అంటే అన్ని రంగాలు అభివృద్ధి దిశగా పయనించడమేనని, కానీ ఏ ఒక్క రంగమూ సరిగ్గా లేదని, పదేండ్లపాటు పస్తులుండి పైసాపైసా కూడబెడితే, రెండేళ్లు కూడా కాలేదు ఈ దుర్మార్గం కాంగ్రెస్ వచ్చి మొత్తానికి మొత్తం రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లు
అన్ని డివిజన్లలో, క్లస్టర్లలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలని కేసీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే ప్రజలు గమనించారని, రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతిభద్ర తల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజ లు ఆలోచన చేయాలని కోరారు.
ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు. నిత్యం నాణ్యమైన కరెంటు ను పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ.. ముంబై, ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేదని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్ప కూల్చారని మండిపడ్దారు.
పతారా ఉంటేనే కదా.. అతార పెరిగేది
బీఆర్‌ఎస్ పాలనలో రాష్ర్ట ఆదాయాన్ని పెంచడానికి గంటలు గంటలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా శాఖలలో ఆదాయాన్ని ఎలా పెంచవచ్చో ఆలోచన చేశామని, అన్ని రంగాల మీద ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటులో దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందని కేసీఆర్ గుర్తుచేశారు. కుటుంబానికైనా, రాష్ట్రానికైనా.. పతేరా(పరపతి) ఉంటేనే కదా.. అతార (డిమాండ్) పెరిగేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలన వల్ల ఏటా 10-.15 శాతం పెరగాల్సిన ఆదాయం మైనస్‌లోకి వెళ్లిపోతు న్నదన్నారు. అన్ని రంగాలు రెండేళ్లలో సర్వ నాశనం అయిపోవడం బాధాకరమని, ఈనగాసి నక్కల పాలు జేసినట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలో ఆర్థికవృద్ధిలో తెలంగాణ చివరి స్థానం లో ఉన్నట్లు రిపోర్టులు వస్తుంటే కండ్లల్ల నీళ్లు వస్తున్నయని విచారం వ్యక్తంచేశారు.
ప్రజలు వాళ్ల పక్కలకు మళ్లా కాంగ్రెస్ అనే బల్లాన్ని తెచ్చుకుంటరా అని ప్రశ్నించారు. బీజేపీ గురించి అడిగితే అదెక్కడుంది అని ప్రజలే ఉల్టా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బీఆర్‌ఎస్ గెలవడం అంటే.. తెలంగాణ భవి ష్యత్తుకు, పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమేనని సూచించారు. ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.