12-12-2025 12:00:00 AM
ముషీరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాం తి): ప్రముఖ సంఘ సేవకులు టి. దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్ లోని నిరుద్యోగ అభ్యర్థులకు గురువారం ముషీరాబాద్ లోని హెరిటేజ్ ప్యాలెస్ లో నిర్వహించిన ఉచిత ఉచిత మెగా జాబ్ మేలాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో 195 కంపెనీలు పాల్గొనగా 5200 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిలో 2010 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నియమక పత్రాలు అందజే శారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ జాబు నిరుద్యోగ జాబ్ నిర్వాహకులు టి దినకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల లక్షరాదిమంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు.
ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, ప్రైవేట్ ఆస్పత్రులు యజమాన్యాలు, హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఈ నిరుద్యోగ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిరుద్యోగ మేళాకు 5000 మందికి పైగా నిరుద్యోగులు పాల్గొన్నా రు. అందులో 2100 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో దినకర్ రెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు.