26 June, 2026 | 6:32 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

మహిళలను మోసం చేయడం కాంగ్రెస్‌కు రివాజు: ఏపీ సీఎం చంద్రబాబు

19-04-2026 12:24 AM

మహిళలను మోసం చేయడమనేది కాంగ్రెస్‌కు మొదటి నుంచి అలవాటేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా కోటా బిల్లుపై కాంగ్రెస్ 30 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తున్నదని ధ్వజమెత్తారు. విపక్షాలు మహిళా కోటా బిల్లును వీగిపోయేలా చేయడం వల్ల, మహిళా రిజర్వేషన్ల అమలు 2034కి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియా కూటమి సహకరిస్తే, బిల్లు సునాయాసంగా ఆమోదం పొందేదని తెలిపారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు చెబుతున్నాయని, వారి వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపడేశారు. 2029 నుంచైనా చట్టసభలో తమకు ౩౩శాతం రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారని, వారి ఆశలపై ఇండియా కూటమి నీళ్లు చల్లిందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.