calender_icon.png 13 September, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంకారప్రాయంగా సామూహిక మరుగుదొడ్లు

13-09-2025 02:48:30 AM

అలంకారప్రాయంగా సామూహిక మరుగుదొడ్లు 

  1. కనీస నీటి వసతి లేని మరుగుదొడ్లు
  2. చుట్టూ ప్లాస్టిక్ బాటిల్ల దర్శనం సైడ్ కాలవలో నిండి ఉన్న బురద నీరు
  3. రోగాల బారిన పడుతున్న ప్రజలు
  4. పరిశుభ్రతకు ఆమడ దూరంలో..

  5. మంగపేట, సెప్టెంబరు 12 (విజయక్రాంతి): స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీప దూరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన సామూహిక మరుగుదొడ్డిలో అపరిశుభ్రత కొట్టొచ్చినట్టు కనబడుతుంది దూర ప్రాంత ప్రజలు వారాంతపు సంతకు మండల కేంద్రానికి వందలల్లో వస్తుంటారు మహిళల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్డిలో కనీసం నీటి వసతి లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం మరుగుదొడ్డి చుట్టూ పడేసిన ప్లాస్టిక్ బాటిల్లు, పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి సైడ్ కాలువల బురద నీటితో పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం వెదచల్లుతూ పరిశుభ్రతకు ఆమడ దూరంలో ఉండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మరుగుదొడ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రామపంచాయతీ కార్యదర్శి వివరణ 

ఈ విషయంపై మంగపేట గ్రామపంచాయతీ కార్యదర్శి బోటా సురేష్ ను చరవాణిలో వివరణ కోరగా మా సిబ్బందితో బుధవారం సామూహిక మరుగు దొడ్డిని శుభ్రపరచి చుట్టూ బ్లీచింగ్ చల్లించి నీటి వసతిని ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తీసుకొస్తామని అన్నారు.