13-09-2025 03:09:52 AM
-తగ్గిన రియల్ వ్యాపారం
-ఆర్థికంగా చేతికిలబడ్డ వ్యాపారులు
-తగ్గిన భూముల ధరలు కొనేందుకు ’నో’ చెబుతున్న రియల్టర్లు..
బాన్సువాడ సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లాలో ’భూమ్’ దందా ఒక్కసారిగా డీలపడింది. ఏడాది క్రితం అత్యధిక ధరలతో అమ్ముడుపోయిన భూముల అమాంతంగా పడిపోవడంతో రియల్ వ్యాపారులు ఆర్థికంగా చతికిలబడ్డారు. మధ్యవర్తితంగా కొనుగోలు చేసిన భూములు అమ్ముడుపోకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఏడాది క్రితం కోట్ల లోపలికిన భూముల ధర ప్రస్తుతం 40 శాతానికి తగ్గిపోవడంతో అనుకోవాలంటే అసలుకే నష్టం వస్తుందన్న ఆందోళన కలుగుతోంది. వ్యవసాయ భూములే కాకుండా ప్లాట్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో రియల్ వ్యాపారులు తమ దందాను మూసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి కొందరు వ్యాపారులైతే వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో జోరుగా సాగిన భూమ్ దందాతో ఆర్థికంగా బాగా స్థిరపడ్డ వ్యాపారులు తాజా పరిస్థితులతో కూడబెట్టుకున్న సొమ్మును వదులు కునే దుస్థితి ఏర్పడింది. టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూముల ధరలు అమాంతంగా ఆకాశానంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ధరలు తగ్గుముఖం పట్టడంతో భూములు ప్లాట్లు అమ్ముకునేవారు ముందుకు రాకపోవడంతో రియల్ వ్యాపారానికి బ్రేక్ పడింది.
ధరల వ్యత్యాసమే కారణమా..?
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ ఎల్లారెడ్డి పిట్లం బీర్కూర్ మదనూర్ జుక్కల్ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం భూమి కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుంది. ప్లాట్ల ధరలైతే గజానికి పదివేల నుండి 25 వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. రోడ్ సైడ్ ప్లాట్ లకు ధర ఊహించే విధంగా పెంచేస్తున్నారు. పట్టణాలు మండల కేంద్రా లు ది నదినాభివృద్ధి చెందడంతో స్థలం ధరలు కూడా అడ్డగోలుగా పెరుగుతూ వస్తున్నాయి. ఆర్థికంగా పరిపుష్టి ఉంటే తప్ప వ్యవసాయ భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
మరికొన్ని చోట్ల గతంలో ఉన్న ధరలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఒక్కసారిగా భూముల ధరలు పడిపోవడంతో అక్కడి వాసులు జాగల నమ్ముకోవా లంటేనే వెనుకడుగు వేస్తున్నారు. పట్టణాల వైశాల్యం పెరుగుతుండడం సమీప గ్రామాలను పట్టణంలో చేర్చడంతో జాగా ధర లక్షల నుండి కోట్లలోకి పెరిగి పోయింది. జిల్లాలో ఎల్లారెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీగా మారడంతో భూముల ధరలపై ప్రభావం పడింది. ఫలితంగా భూముల అమ్మకాలు కొనుగోలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
పదిమంది కలిసి రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు. భూములను ప్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు నామమాత్రంగా అడ్వాన్సులు చెల్లించి అట్టి వాటిని అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. వచ్చిన లాభాన్ని పదిమంది సమానంగా పంచుకునే పరిస్థితి ఉండేది. దీంతో రియల్ వ్యాపారం కొంతకాలం వరకు దండిగా నడిచింది. భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మిన్నుకుండు పోవాల్సి వస్తుంది.
రియల్ దందాకు అడ్డు కట్టబడడంతో వ్యాపారాన్ని మానుకొని పరిస్థితి నెలకొందని పలువురు రియల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల కొనుగోలు చేసిన భూములు ప్లాట్లు కూడా అమ్ముడుపోకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు తడిసీమొపై రియల్ వ్యాపారులు ముఖం చాటిసి పరిస్థితి కూడా నెలకొంది. మరికొందరైతే ఈ దందాలో ఇరుక్కుపోయి అరసత్వంగా వచ్చిన భూములు జాగాలను కూడా అమ్ముకొని అప్పులు కట్టే పరిస్థితి కూడా దాపరించింది.
వేలవేల పోతున్న రిజిస్ట్రేషన్ దప్తర్లు...
రియల్ వ్యాపారం కుదరవడంతో రిజిస్ట్రేషన్లు సైతం తగు ముఖం పట్టాయి. భూముల కొనుగోలు అమ్మకాలు లేకపోవడంతో రియల్ వ్యాపారులతో సందడిగా కనిపించే రిజిస్ట్రేషన్ ఆఫీసులు వేలవేల బోతున్నాయి. రియల్ వ్యాపారం జోరుగా సాగే రోజుల్లో కార్యాలయాలు కిక్కిరిసి కనిపించేవి. రిజిస్ట్రేషన్‌ల కోసం క్రయవిక్రియ దారులు కార్యాలయాల ముందు పడిగాపులు కాచి స్థితి ఉండేది.
ప్రస్తుతం భూము లు ధరల ప్రభావం పడడంతో సామాన్యులు కొనుగోలు చేసేందుకు జంకుతుం డడంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు బిజీ తగ్గింది. జరుగుతున్న క్రయవిక్రయాలకు కొన్ని మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇంతకుముందు 50 కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవని, పది రిజిస్ట్రేషన్లు జరగాలంటేనే కష్టంగా ఉన్నట్లు వాపోతున్నారు. డాక్యుమెంటరీ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు తో కలిపి భారీగానే సొమ్ము సమకూరేది. అత్యధికంగా రెవిన్యూ అందిం చే శాఖ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వానికి, భారీగానే గండి పడుతుంది.