calender_icon.png 23 August, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో ముదిరిన విభేదాలు

23-08-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకంగా పనిచేయలేదు 

బోయినపల్లి ఆగస్టు22(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండల. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపాకనపడ్డాయి. శుక్రవారం బోయినపల్లి మండలంలో పనుల జాతరలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించడానికి బోయినపల్లికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రానుండగా కార్యక్రమానికి ముందే బోయినపల్లిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొద్ది రోజులుగా ఉన్న రాజకీయ విభేదాలు చివరికి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు బగుమని చివరకు కాంగ్రెస్ చేతను కూస రవీందర్ ను పోలీసులు అదుపులో తీసుకొని ఎమ్మెల్యే కార్యక్రమం అయిపోయాక విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనులు చేయలేదని ఆయన వాపోయారు.

ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం లేకముందు ఎన్నో ఆటుపోట్లను రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నానని ఆయన విలేకరుల చెప్పారు. ఏది ఏమైనా ఆయనను పోలీసుల అదుపు తీసుకోవడంతో మండల జిల్లా వ్యాప్తంగా చర్చ నియాంశంగా మారింది.