calender_icon.png 23 August, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ భవన నిర్మాణపు పనులకు శంకుస్థాపన

23-08-2025 12:00:00 AM

గద్వాల రూరల్, ఆగస్టు 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా గద్వాల మండలం, జిల్లెడ బండ తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణపు పనులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు శుక్రవారం పనుల జాతర-2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత సంవత్సరం 13 కోట్ల రూపాయలతో గద్వాల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఈ సంవత్సరం కూడా వందరోజుల పని దినాలు కల్పించి కొత్త పనులను చేపట్టనున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద పని కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎంపీడీవో ఉమాదేవి, పంచాయతీరాజ్ డిఈ కబీర్ దాస్, ఏఈ బషీర్, గ్రామ కార్యదర్శి కవిత, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.