23-08-2025 12:00:00 AM
గద్వాల టౌన్ ఆగస్టు 22: జిల్లా ప్రాజెక్టుల పునర్నిర్మాణం,పెండింగ్ ప్రాజెక్టులను త్వర గా పూర్తి చేయడం కోసం పోరాటాలు చేస్తామని గద్వాల జిల్లా కార్యదర్శి బి ఆంజనే యులు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన రాష్ట్ర సీపీఐ 4వ మహాసభలలో ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 12 మండలాల్లో మహాసభలను ఏర్పాటు చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
ఇతర ప్రజా సంఘాలను,కా ర్మిక సంఘాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు.నడిగడ్డ ప్రాంతంలో సీడుపత్తి రైతుల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పార్టీ ప్రజాసంఘాలు రైతు సంఘాలు కార్మి క సంఘాల విద్యార్ధి యువజన సంఘాల నిర్మాణం పైన భవిష్యత్తులో అన్ని సమస్యల పైన ఉద్యమాలు కొన సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు తదితరులు పాల్గొన్నారు.