17-05-2025 12:58:36 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): హెచ్‌సీయూలో మురుగునీరు తాగి జింకలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని, ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని నల్లగండ్ల నవోదయ కాలనీ నుంచి శుద్ధి చేయని మురుగునీరు నేరుగా హెచ్‌సీయూ స్థలంలోకి వస్తోందని, ఆ నీటిని అక్కడి జింకలు తాగుతున్నాయని, ఫలితంగా వాటి ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఎక్స్‌లో ఓ యూజర్ ట్వీట్ చేయగా.. కేటీఆర్ దాన్ని సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. జింకల ఆరోగ్యం ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.