17-05-2025 12:59:16 AM
యాచారం, మే 16: ఆన్‌లైన్ గేమిం గ్, డ్రగ్స్, చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఆన్లైన్ గేమింగ్, డ్రగ్స్, పేకాటతో పాటు చెడు వ్యాసనలపై యువత. విద్యార్థులు. ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. అన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారి ఎంతో మంది యువత, విద్యార్థులు ఆర్థికంగా నష్టం చేకూర్చడంతో పాటు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకుంటూ యువత పెడదారి పడుతున్నారని, నేరాలకు పాల్పడుతున్నా రని చెప్పారు.
విద్యార్థులు, యువత ఎప్పుడు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉంటూ, వారికి సాధ్యమైనంత వరకు ఫోన్ ఇవ్వకూదని తల్లిదం డ్రులకు సీఐ సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ అండగా ఉం టుందని, 100కి కాల్ చేయాలని అన్నా రు. కార్యక్రమంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మసీటీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తేజంరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.