24-08-2025 09:06:28 AM
మేడ్చల్: మేడ్చల్ జిల్లా(Medchal District)లోని మేడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన భార్యను హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని ఆమె భర్త ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. పోలీసుల తెలిపిన నివేదికల ప్రకారం... వికారాబాద్ జిల్లాకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి(22) మహేందర్ రెడ్డి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని మేడిపల్లిలోని బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం భార్య స్వాతిని భర్త ముక్కలుగా నరికి చంపాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి మూసీలో పడేసిన మహేందర్.. మిగిలిన మొండాన్ని కవర్ లో ప్యాక్ చేశాడు. మొండాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. భర్త మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, స్వాతి ఆత్మహత్య చేసుకుందని మహేందర్ రెడ్డి తన సోదరికి విషయన్ని తెలపగా.. సోదరి స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.