24-08-2025 08:41:08 AM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పట్టణంలోని మల్లికార్జున నగర్ కి చెందిన సంధవేణి నాగమణి అనే మహిళ గతకొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్(Atmiya Seva Charitable Trust) సభ్యులు శనివారం వైద్య ఖర్చుల నిమిత్తం నాగమణి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, బీనవేన సంపత్, సట్ల మహేందర్, కోడిపాక అశోక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.