24-08-2025 09:43:36 AM
హైదరాబాద్: వరంగల్ జిల్లా(Warangal District)లోని వర్దన్నపేట రైతువేదికలో ఆదివారం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కోసం రైతులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. రైతువేదిక వద్ద రైతులు గొడవ చేస్తుండడంతో సంఘటనస్థలికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం అధికారులు యూరియాను పోలీసుల పహరా నడుమ పంపిణీ చేశారు. 10 ఎకరాలున్న రైతుకు ఒకటే యూరియా బస్తా ఇస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. రంగంలోకి పోలీసులు దిగడంతో సద్దుమనిగిన రైతులు ఆందోళనను విరమించారు.