calender_icon.png 24 August, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లి మండలం బోడుప్పల్‌లో దారుణం

24-08-2025 09:45:53 AM

మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్, శ్రీనివాస్ నగర్‌లో భార్యను దారుణంగా హతమార్చిన భర్త, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన స్థానికులను కలిచివేసింది. వికారాబాద్‌కు చెందిన మహేందర్ రెడ్డి (28), స్వాతి అలియాస్ జ్యోతి (21)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేందర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతిని వివాదాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి రాత్రి హతమార్చి  ముక్కలు ముక్కలుగా చేసి కవర్ల లో ప్యాక్ చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన అమ్మాయి బావ పొలీసులకు సమాచారం అందించాడు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు ప్రారంభించారు.